కూన రవికి.. దువ్వాడ మద్దతు!

by Thanuru Gopichand |

కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్​ కు వైసీపీ నుంచి సస్పెన్షన్​ కు గురైన ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలిచారు.

కూన రవికి.. దువ్వాడ మద్దతు!
X

కూన రవికి.. దువ్వాడ మద్దతు!

శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర పరిణామం

దిశ, డైనమిక్ బ్యూరో : కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్​ కు వైసీపీ నుంచి సస్పెన్షన్​ కు గురైన ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలిచారు. ఆ జిల్లాలో ఈ పరిణామం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. సౌమ్య బదిలీ అంశాన్ని కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని దువ్వాడ ఆరోపించారు. కూన రవి మంత్రి రేసులో ఉండడంతో అచ్చెన్నాయుడు ఈ కుట్ర చేస్తున్నారంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. ఆమెను కూన రవి హింసించినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. టెక్కలి నియోజకవర్గంలో కలింగ సామాజిక వర్గం వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అచ్చెన్నాయుడు చెప్పగానే కృష్ణదాసు పరామర్శకు వెళ్లారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే తరపున వైసీపీ ఎమ్మెల్సీ మాట్లాడడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది

Next Story