- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్మెట్ లేకుండా దువ్వాడ దివ్వెల బైక్ రైడ్.. నెటిజన్లు ఫైర్
దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వీళ్లిద్దరూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా ఎక్కడ చూసినా వీళ్ల వీడియోలే దర్శనం ఇస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వీళ్లిద్దరూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా ఎక్కడ చూసినా వీళ్ల వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. వరుసగా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ఈ కొత్త జంట రీల్స్ సైతం చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను రోజురోజుకు పెంచుకుంటోంది. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ కు రాజకీయ నాయకుడిగా క్రేజ్ ఉండగా దివ్వెల మాధిరి సోషల్ మీడియా రీల్స్, బిగ్ బాస్ ద్వారా అభిమానులను సంపాదించుకుంది.
కాగా తాజాగా వీరిద్దరూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో దువ్వాడ శ్రీనివాస్ బుల్లెట్ బైక్ నడుపుతుంటే దివ్వెల మాధురి ఆయన వెనకాల కూర్చుకున్నారు. ఈ రీల్ బ్యాగ్రౌండ్ లో ఓ బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉండగా నెట్టింట వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే దువ్వాడ హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ డ్రైవ్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ అయ్యుండి రోడ్డుపై హెల్మెట్ పెట్టుకోకుండా ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






