విజయవాడలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం.. ఐదు ప్రదేశాల్లో కార్యక్రమాలు

by Vemula.Srinu Prasad |

విజయవాడలో సోమవారం నుంచి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ..

విజయవాడలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం.. ఐదు ప్రదేశాల్లో కార్యక్రమాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో సోమవారం నుంచి దసరా ఉత్సవాలు(Dassehra) జరగనున్నాయి. విజయవాడ ఉత్సవ్ పేరుతో నగరంలోని ఐదు ప్రదేశాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజ‌య‌వాడ న‌గ‌ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతి, చారిత్రక‌, అధ్యాత్మిక వైభ‌వాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేలా నిర్వహించేందుకు ఉత్సవ్‌ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఉత్సవ్‌లో భాగంగా ప్రత్యేక గీతం రూపకల్పన చేపట్టనున్నున్నట్లు ఉత్సవ్ కమిటీ సభ్యులు తెలిపారు. . గత ఐదేళ్లు రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు లేవన్నారు. విజయవాడ ఉత్సవ్‌తో దుర్గమ్మ శోభ తగ్గదని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story