రాష్ట్ర బడ్జెట్ వేళ.. మెడికల్ ఫార్మా మాఫియాపై యుద్ధం ప్రకటించిన సీపీఐ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-11 07:47:35  IST  )

రాష్ట్ర బడ్జెట్ వేళ.. మెడికల్ ఫార్మా మాఫియాపై సీపీఐ యుద్ధం ప్రకటించింది..

రాష్ట్ర బడ్జెట్ వేళ.. మెడికల్ ఫార్మా మాఫియాపై యుద్ధం ప్రకటించిన సీపీఐ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర బడ్జెట్ వేళ.. మెడికల్ ఫార్మా మాఫియాపై సీపీఐ యుద్ధం ప్రకటించింది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సీపీఐ నేతలు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్ పార్టీల నేతలు పొల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేశారని మండిపడ్డారు. కల్తీ అనే వాళ్లు.. కాదనే వాళ్లు ఇద్దరూ సైతం హిందువులేనని చెప్పారు. సిట్ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని సిఫార్స్ చేస్తే ఇప్పటివరకూ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేస్తే శిక్ష అవుతుందా అని నిలదీశారు. మతాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనేదే తప్ప మరోటి కనిపించడంలేదని లెఫ్ట్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 వరకూ కొనసాగనున్నాయి. ఈ నెల 14న అసెంబ్లీలో ఆర్థిక శాఖ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఇదే రోజున రాష్ట్రంలో ఆందోళనకు సీపీఐ పిలుపునివ్వడంతో ఉత్కంఠ నెలకొంది.

Next Story