- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ధర్నా.. ఉద్రిక్తత
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు ధర్నాకు దిగారు..

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమా రిలీజ్ అయింది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఏపీ(Ap)లో ఇప్పటికే బెన్ ఫిట్ షోలు వేశారు. సినిమా హిట్ కొడుతుందని ఫ్యాన్ అంటున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న కథతో ఈ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. సినిమాలో బాలయ్యను చూపించిన బాగుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలోని మార్కాపురం(Markapuram)లో మాత్రం షాకింగ్ ఇన్నిడెంట్ చోటు చేసుకుంది. బాలకృష్ణ ఫ్యాన్స్ ధర్నాకు దిగారు. ఈ ఉదయం మార్కాంపురం శ్రీనివాస్ థియేటర్‌లో ‘డాకు మహారాజ్’ సినిమా చూసేందుకు వెళ్లారు. అయితే అక్కడ షో ప్రదర్శించలేదు. దీంతో ఒక్కసారిగా షాక్ గురైన అభిమానులు ఆందోళనకు దిగారు. సినిమా ప్రదర్శనపై థియేటర్ యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ యజమానులు సిండికేట్‌గా మారాయని ఆరోపించారు. కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. బాలయ్య సినిమాను వెంటనే ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.






