- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan:మాజీ సీఎం పర్యటనలో ఉద్రిక్తత.. పార్టీ కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) వైఎస్సార్ కడప జిల్లా మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) వైఎస్సార్ కడప జిల్లా మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో క్యాంపు ఆఫీసుకు వచ్చిన వారి నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల(Pulivendula)లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జరిగిన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. తోపులాట జరగడంతో కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రజాదర్బార్ కార్యక్రమంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్‌తో పాటు, ఎంపీ అవినాశ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.






