- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్.. అరెస్ట్
by Vemula.Srinu Prasad |
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District) సాలూరు, మక్కువ మండలాల్లో ఇటీవల పవన్ కల్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో నకిలీ ఐపీఎస్(Fake IPS) అధికారి పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ వెన్నంటే కలియతిరిగారు. భద్రతా సిబ్బందితో ఫోటోలు దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో ఈ నకిలీ ఐపీఎస్ దిగిన ఫొటోలను పరిశీలించారు. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు సూర్య ప్రకాశ్‌గా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






