Durga Temple: దుర్గమ్మ గుడి ప్రధానార్చకుడు కన్నుమూత

by Shiva |
Durga Temple: దుర్గమ్మ గుడి ప్రధానార్చకుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు లంగంభొట్ల బద్రీనాథ్ బాబు (Lingambotla Badrinath Babu) కన్ను మూశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన తన ఇంట్లోనే హార్ట్ ఎటాక్‌ (Heart Attack)తో తుది శ్వాస విడిచారు. అయితే, బద్రీనాథ్ బాబు కొన్నేళ్ల పాటు ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా కొనసాగారు. అయితే, ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Aanam Ramnarayana Reddy) మాట్లాడుతూ.. బద్రీనాథ్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తేలియజేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు బద్రీనాథ్ బాబు అకాల మరణం తీరని లోటని అన్నారు. అమ్మవారి అలంకరణ, ఆచార వ్యవహారాల్లో అపారమైన అనుభవంతో బద్రీనాథ్ బాబు ఏళ్లుగా సేవలందించారని ఆనం కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed