- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీకి దుబాయ్ భక్తుడు రూ. కోటి విరాళం
by Sathputhe Rajesh |
దిశ, రాయలసీమ: దుబాయ్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ ఎం. హనుమంత కుమార్ శుక్రవారం

X
దిశ, రాయలసీమ: దుబాయ్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ ఎం. హనుమంత కుమార్ శుక్రవారం టీటీడీకి రూ.కోటి విరాళంగా అందించారు. తిరుమల లోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఈ మేరకు డీడీ అందజేశారు. టీటీడీ అభీష్టం మేరకు ఈ సొమ్ము ఏ ట్రస్ట్ కైనా జమచేసుకోవాలని దాత కోరారు. అటు టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ కు సికింద్రాబాద్ కు చెందిన శ్రీ పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీధర్ శుక్రవారం రూ.10, 01, 116 ( పదిలక్షల వెయ్యి నూట పదహారు) విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు డీడీని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. చైర్మన్ వైీ సుబ్బారెడ్డి నేతృత్వంలో గో సంరక్షణకు టీటీడీ చేపట్టిన చర్యలకు సంతోషించి ఈ విరాళం అందించినట్లు దాత తెలిపారు.
Next Story






