- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాక్షి కార్యాలయానికి నిప్పు అంటూ ప్రచారం.. డీఎస్పీ శ్రవణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్
ఏలూరులో సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టారంటూ జరిగిన ప్రచారంపై డీఎస్పీ శ్రవణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు(Eluru)లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఘటన రాజకీయ రచ్చకు దారి తీసింది. మంగళవారం ఏలూరులోని గోదాము(Godown)లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మంటలు భవనం అంతా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. అయితే ఈ భవనంలోనే సాక్షి కార్యాలయాన్ని(Sakshi Office) నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయానికి మంటలు అంటుకున్నాయి.
అయితే ఈ అగ్నిప్రమాదం వెనుక టీడీపీ(Tdp) ఆందోళనకారులు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. సాక్షి డిబేట్‌లో అమరావతి(Amaravati) మహిళలను కించపర్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను జరుగుతున్నాయి. చానల్ చైర్ పర్సన్, జగన్ సతీమణి వైఎస్ భారతీ(YS Bharti) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులే ఏలూరులోని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టారంటూ ప్రచారం చెలరేగింది. దీంతో స్థానిక టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సాక్షి ఆఫీస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్(DSP Shravan Kumar) స్పష్టం చేశారు. సాక్షి ఆఫీస్‌పై దాడి అన్న ప్రచారం అవాస్తవం అని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు.






