మద్యం మత్తులో కారు డ్రైవర్ హల్‌చల్.. విద్యార్థినులపై!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-18 06:42:47  IST  )

ఏపీ(Andhra Pradesh)లోని విజయవాడ(Vijayawada) బెంజి సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.

మద్యం మత్తులో కారు డ్రైవర్ హల్‌చల్.. విద్యార్థినులపై!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని విజయవాడ(Vijayawada) బెంజి సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ముందు వెళ్తున్న రెండు కార్లను ఢీ కొట్టాడు. అంతటితో ఆగకుండా కారుతో మరోసారి హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యార్థినులపై కారు దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ తరుణంలో ఘటనను గమనించిన స్థానికులు.. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు యజమాని ఓ పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడుగా సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story