- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల శిలాతోరణం వద్ద డ్రోన్ కలకలం
by Ajay Maddhiboyina |
తిరుమలలో డ్రోన్ కలకలం రేగింది. శిలాతోరణం వద్ద డ్రోన్ గాలిలో భక్తులకు కనిపించింది. దీంతో భక్తులు ఫిర్యాదు చేయగా విజిలెన్స్

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో డ్రోన్ కలకలం రేగింది. శిలాతోరణం వద్ద డ్రోన్ గాలిలో భక్తులకు కనిపించింది. దీంతో భక్తులు ఫిర్యాదు చేయగా విజిలెన్స్ అధికారులు ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని విదేశీయుడిగా గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులను ఎగరవేయకూడదు అనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమల ఆలయంపై నుండి విమానాలను కూడా రద్దు చేశారు. గతంలో రెండు మూడు సార్లు విమానాలు సంచరిస్తే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకుంది. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించింది. ఇక తాజాగా డ్రోన్ ఎగరేసిన భక్తుడు విదేశీయుడు కావడంతో రూల్స తెలిసి ఉండకపోవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. విచారణ తరవాత అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది.
Next Story






