అల్లూరి జిల్లా ఏజెన్సీలో కుప్పకూలిన డ్రోన్.. తీవ్ర భయాందోళనకు గురైన జనం

by Kema Shiva Kumar |

అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఓ డ్రోన్ తీవ్ర కలకలం రేపింది. దీంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అల్లూరి జిల్లా ఏజెన్సీలో కుప్పకూలిన డ్రోన్.. తీవ్ర భయాందోళనకు గురైన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా డ్రోన్ (Drone) కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని జి.మాడుగుల (G Madugula) మండలం బొయితిలి (Boithili) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు అత్యవసర వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం, రెడ్ వింగ్ సంస్థ (Red Wing Company) సంయుక్తంగా డ్రోన్ సేవలను పరిశీలిస్తున్నాయి. ఇందులో భాగంగా, రక్తం నమూనాలు, అత్యవసర మందులను వేగంగా తరలించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ ట్రయల్ రన్ చేపట్టారు. అయితే, బొయితిలి గ్రామ పరిసరాల్లో ఎగురుతుండగా డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. కింద ఉన్న దట్టమైన చెట్లపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story