ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం: భద్రతా బలగాల హై అలర్ట్

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సచివాలయం వద్ద డ్రోన్ తరహా పరికరం ఆకాశంలో చక్కర్లు కొట్టడం ఒక్కసారిగా కలకలం రేపింది. ..

ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం: భద్రతా బలగాల హై అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(Amaravati)లో సచివాలయం వద్ద డ్రోన్(drone) తరహా పరికరం ఆకాశంలో చక్కర్లు కొట్టడం ఒక్కసారిగా కలకలం రేపింది. రాష్ట్ర శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యంత భద్రత ఉండే సచివాలయం పైభాగంలో గుర్తుతెలియని పరికరం కనిపించడంతో ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు.

డ్రోనా లేక శిక్షణ విమానమా..?

ఈ పరికరం అసలు డ్రోనా లేక శిక్షణ విమానమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై వివిధ భద్రతా సంస్థలతో కలిసి పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం జరుగుతున్న కీలక సమయంలో ఈ పరికరం సంచరించడంపై ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి సారించి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ప్రయోగించారు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story