- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కుమారుడిని అనంతబాబే చంపాడు: డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి వాంగ్మూలం
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానంలో రెండోరోజు విచారణ కొనసాగింది. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు(Driver Subramaniam murder case)లో రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం(Rajahmundry Special Court)లో రెండోరోజు విచారణ(Investigation) కొనసాగింది. ఈ సందర్భంగా మృతుడి తండ్రి సత్యనారాయణ, సోదరుడు నవీన్‌ల వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేశారు. అనంతబాబుకు సంబంధించిన అవినీతి, అక్రమాలన్నీ సుబ్రహ్మణ్యానికి తెలియడం వల్లే అతడిని దారుణంగా హతమార్చారని సాక్షులు కోర్టుకు తెలిపినట్లు పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వెల్లడించారు.
నా కుమారుడిని అనంతబాబే చంపేసి..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబే తన కుమారుడిని చంపేసి, ఆపై మృతదేహాన్ని ఇంటి ముందు డోర్ డెలివరీ చేశారని మృతుడి తల్లిదండ్రులు న్యాయమూర్తి ముందు సాక్ష్యం చెప్పినట్లు పీపీ వివరించారు. ఈ కేసులో ముగ్గురు కీలక సాక్షులు కోర్టుకు హాజరై నిందితుడికి వ్యతిరేకంగా తమ స్టేట్‌మెంట్లను నమోదు చేయించారు.






