దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి

by Thanuru Gopichand |

పొలం పనులు చేస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం.

దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : దమ్ము ట్రాక్టర్ (Tractor) తిరగబడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో (Konaseema District) చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కాట్రేనికోన (Katrenikona) మండలంలోని ఓ పొలంలో డ్రైవర్ గుత్తుల వేణుగోపాలరావు (42) దమ్ము చేసేందుకు పొలంలో దుక్కి చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పింది. ఒక్కసారిగా ముందు టైర్లతో సహా ట్రాక్టర్ పైకి లేచి తిరగబడింది. దాని కిందనే వేణుగోపాలరావు (Venugopala Rao) చిక్కుకుపోయాడు. అది గమనించి సమీపంలోని రైతులు అతని బయటకు తీసు ప్రయత్నం చేశారు. ప్రయోజనం కనిపించకపోవడంతో మరో ట్రాక్టర్ సహాయంలో బోల్తా కొట్టిన ట్రాక్టర్ ను తొలగించారు. అయితే అప్పటికీ వేణుగోపాల రావు ప్రాణాలను కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కాట్రేనికోన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక రైతులను విచారించి వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేణుగోపాలరావు మృతితో అతని ఇంట విషాదం నెలకొంది.

Next Story