నెల్లూరులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు

by Vemula.Srinu Prasad |

నెల్లూరులో ఈ రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంది...

నెల్లూరులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nelore)లో ఈ రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Goverdhan)కి నోటీసులు అందజేశారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy chandramohan)పై అసభ్యవ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు రూరల్‌తో పాటు పొదలకూరు, మనుబోలులో టీడీపీ నేతల ఫిర్యాదులతో కాకాణిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో మంగళవారం మధ్యహ్నాం పోలీసులు కాకాణి ఇంటికి వెళ్లారు. ఆయనతో మాట్లాడి నోటీసులు అందజేశారు. విచారణకు హాజరు కావాలని సూచించారు.

అసలేం జరిగిందంటే..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగినట్లు గుర్తించింది. గత ప్రభుత్వం ఈ తంతగం నడిచినట్లు కేసు నమోదు చేసి విచారణను సిట్‌కు అప్పగించింది. అయితే సిట్ పై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు కేసును విచారించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐలోని సిట్ అధికారులు తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై విచారణ చేపట్టారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన డెయిరీలను వాటి యజమానులతో పాటు నిందితులందర్నీ విచారించారు. చివరకు విచారణ ముగియడంతో ఆ నివేదికను సిట్ అధికారులు సిట్‌కు సమర్పించారు. నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని, కాని కల్తీ జరిగినట్లుగానే నివేదికలో పేర్కొంది.

చంద్రబాబు సహా టీడీపీ నేతలపై...

దీంతో సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని అడ్డుపెట్టుకుని తమపై ఎన్ని మాటలన్నారంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్, అంబటి రాంబాబు, జోగి రమేశ్, బొత్సతో పాటు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా ఇతర నాయకులపైనా ఆయన అసభ్యంగా మాట్లాడారు. ఇక మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రబాబు మోహన్‌పై అయితే ఓ రేంజ్‌లో దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలపై సోమిరెడ్డి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు సీరియస్ అయ్యారు. ఆయా ప్రాంతాల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసులు పెట్టారు. ఈ మేరకు కాకాణికి పోలీసులు నోటీసులు అందజేశారు. కేసు విచారణకు సహకరించాలని నెటీసుల్లో పోలీసులు స్పష్టంచేశారు.

Next Story