కొత్త డీఎంఈగా విష్ణువర్ధన్‌.. వైద్యారోగ్య శాఖలో భారీగా బదిలీలు, పదోన్నతులు

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో భారీ స్థాయిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరిగింది.

కొత్త డీఎంఈగా విష్ణువర్ధన్‌.. వైద్యారోగ్య శాఖలో భారీగా బదిలీలు, పదోన్నతులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో భారీ స్థాయిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరిగింది. వైద్యారోగ్య శాఖ పంపిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేయడంతో మంగళవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్‌ను ప్రభుత్వం నియమించింది. తాజాగా పదోన్నతులు పొందిన 15 మంది అదనపు డీఎంఈ (ఏడీఎంఈ)లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు కేటాయించింది. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు నలుగురు కొత్త ప్రిన్సిపల్స్, తొమ్మిది మంది సూపరింటెండెంట్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్నం విమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్‌ వి. మన్మథరావు

డీఎంఈగా డాక్టర్‌ అత్తలూరి విష్ణువర్ధన్‌, అదనపు డీఎంఈ (డీఎంఈ కార్యాలయం) డాక్టర్‌ సత్యనారాయణమూర్తి, విశాఖపట్నం విమ్స్ (VIMS) డైరెక్టర్‌గా డాక్టర్‌ వి. మన్మథరావు, విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ రఘునందన్‌ నియామకం అయ్యారు.

వివిధ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపల్స్

కాకినాడ (రంగరాయ మెడికల్ కాలేజ్)కు డాక్టర్‌ ఉషాకిరణ్‌, పాడేరు మెడికల్ కాలేజ్‌కి డాక్టర్‌‌ బసుమిత్ర దాస్‌, ఒంగోలు మెడికల్ కాలేజ్‌కి డాక్టర్‌ శివాని, రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్‌కి డాక్టర్‌ ఎం.ఎస్. రాజు, పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్‌కి డాక్టర్‌ శ్రీనివాసులు (మరియు డాక్టర్‌ గోవిందు)లను ప్రిన్సిపల్స్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల పాలనలో మరింత వేగం పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story