- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Inter Exam Results-2025:ఇంటర్ మార్కుల మెమోలు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఇంటర్మీడియట్ ఫలితాలు (Inter Results 2025) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ నెల(ఏప్రిల్) 12వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రకటించింది. మరోవైపు సప్లిమెంటరీ పరీక్షల(Supplementary exams) తేదీలను కూడా ప్రకటించింది.
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులు, ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే విద్యార్ధులు ఈ నెల 15వ తేదీ నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు షార్ట్ మెమోలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. 2024-2025 విద్యా సంవత్సరం మార్కులు షార్ట్ మెమోలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు వెబ్‌సైట్‌లో https://bie.ap.gov.in/ShortMemos రోల్ నంబర్, పాస్ ఇయర్, కోర్సు, పుట్టినతేదీ ఎంటర్ చేసి షార్ట్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.






