- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధవళేశ్వరం బ్యారేజీకి పెరిగిన వరద.. నీట మునిగిన లంక గ్రామాలు
మహారాష్ట్ర, తెలంగాణల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. గోదావరికి వరద (Godavari Floods) పోటెత్తింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర, తెలంగాణల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. గోదావరికి వరద (Godavari Floods) పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీకి (Dowleswaram Barrage) వరద తాకిడి పెరగడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 175 గేట్లన్నింటినీ ఎత్తి.. వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2,00,600 క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి వెళ్లి కలుస్తుండగా.. లంక గ్రామాలు నీట మునిగాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
వరద కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంకగ్రామాల్లో నీరు చేరుతోంది. పి.గన్నవరం మండలం బూరుగులంక వద్ద టెంపరరీ దారి వరదనీటిలో కొట్టుకుపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అత్యవసరమైనవారు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆనగారిలంక పెదమల్లంక గ్రామాలకు వెళ్లే తాత్కాలిక బాటలు కూడా కొట్టుకుపోవడంతో ఆ గ్రామ ప్రజలు కూడా పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.






