- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:‘అది నా వ్యక్తిగతం.. రాజకీయం చేయొద్దు’.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైద్యుల సూచన మేరకు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయారు. అయితే బెడ్ రెస్ట్ తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు నుంచి దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు(బుధవారం) ఉదయం హైదరాబాద్‌లోని బేగం పేట విమానాశ్రయం నుంచి నేరుగా కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అనంతరం కొచ్చి దగ్గర శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాది రాష్ట్రాల ఆలయ సందర్శన పూర్తిగా తన వ్యక్తిగతమని, దానికి రాజకీయాలతో సంబంధం లేదని డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియా(Social Media)లో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలియకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత విషయాలకు రాజకీయాలు జోడించడం కరెక్ట్ కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. వెన్నెముకలో విప్‌లాష్ గాయంతో బాధపడుతున్నని అన్నారు. అయితే సుమారు నాలుగున్నరేళ్ల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల్ని తీర్చుకోవడం కోసం ఆరోగ్యం సహకరించకున్నా రావాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాల్ని దర్శించుకుంటున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.






