Sri Reddy : పార్టీని వదిలివెళ్లకండి : శ్రీరెడ్డి విన్నపాలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-19 11:20:16  IST  )

పార్టీ కష్టా(Pparty In Trouble)ల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లకండ(Don't Leave)ని వైసీపీ నాయకురాలు, నటి శ్రీరెడ్డి(YSRCP Leader, Actress Sri Reddy) ఆ పార్టీ శ్రేణులకు, నాయకులకు విజ్ఞప్తి(Appeal)చేశారు.

Sri Reddy : పార్టీని వదిలివెళ్లకండి : శ్రీరెడ్డి విన్నపాలు
X

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లకండని వైసీపీ నాయకురాలు, నటి శ్రీరెడ్డి(YSRCP Leader, Actress Sri Reddy) ఆ పార్టీ శ్రేణులకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ స్పోక్ పర్సన్ రవిచంద్రారెడ్డి రాజీనామా బాధించిందన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారు..సమస్య ఏమిటని అడిగే అర్హత, హక్కు, పార్టీలో స్థానం నాకు లేదన్నారు. రవిచంద్రారెడ్డి స్పీచ్ లు ఎంతో బాగుంటాయని..కాని ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఏం చేయలేనన్నారు.

అయితే కష్టకాలంలో జగన్ అన్నకి సపోర్ట్ చేయండని, కొంచం ఓపిక పట్టండని పార్టీ నాయకులను కోరారు. మాలాంటి వారు ఏ గుర్తింపు లేకున్న జగనన్నకు మద్ధతుగా మావంతు ఉడుతా సహాయం చేస్తున్నామన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీనామాలు పార్టీ పటిష్టత ప్రయత్నాలను, కేడర్ ను నిరుత్సాహ పరుస్తాయని పేర్కొన్నారు. పార్టీ అన్నా..జగన్ అన్నా అభిమానం మాత్రం అందరిలోనూ ఉందన్నారు.

రాజకీయంగా ఇబ్బందికర సమయంలో మీరు పార్టీలో యాక్టివ్ గా వ్యవహరించకపోయినా, సెలెన్స్ గా ఉన్నా ఫర్వాలేదని...పార్టీకి రాజీనామాలు మాత్రం చేయకండని వైసీపీ నాయకులను శ్రీరెడ్డి కోరారు.

Next Story