- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janasena : గీత దాటొద్దు.. నేతలకు జనసేన వార్నింగ్
హద్దు మీరితే చర్యలు తప్పవంటూ పార్టీ నేతలకు జనసేన హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : హద్దు మీరితే చర్యలు తప్పవంటూ పార్టీ నేతలకు జనసేన హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ(Janasena Party) ఓ లేఖను విడుదల చేసింది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్ తో లేఖ(Warning Letter)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ గీత దాటుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని తెలిపింది. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి(Mangalagiri) నుంచి విడుదలైంది.
లేఖలో ఏముందంటే.. "జనసేన పాలసీపైనా, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి, పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సభలు, సమావేశాలలో ఎప్పటి కప్పుడు తెలియజేస్తునే ఉన్నారు. అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీలైన్‌ను విస్మరించి మాట్లాడుతూన్నారు. ఆ మాటలు ఇటు ప్రజలలోను, అటు పార్టీ శ్రేణుల్లోనూ అపోహలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారు కఠిన చర్యలకు గురి కావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం.” అని జనసేన విడుదల చేసిన లేఖలో ఉంది.






