TTD: టీటీడీ గోశాలలో గోవుల మృతి వదంతులు నమ్మొద్దు

by Thanuru Gopichand |

టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని ప్రచారం జరుగుతోంది.

TTD: టీటీడీ గోశాలలో గోవుల మృతి వదంతులు నమ్మొద్దు
X

100 గోవులు మృతి చెందాయని వెల్లడించిన భూమన

దిశ డైనమిక్ బ్యూరో : టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు అవాస్తవం అంటూ టీటీడీ ఖండించింది. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని ఒక ప్రకటనలో పేర్కొంది. మృతి చెందిన గోవులు ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు ఫొటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడి ఖండిస్తోందని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతోంది. మేరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది..

గత మూడు నెలల్లో 100 కు పైగా గోవులు మృతి చెందాయి : మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

అయితే గత మూడు నెలల్లో టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయని కానీ ఈ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టారు అని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bumana) ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, తిరుమల (Tirumala) పవిత్రను కాపాడతామని చెప్పిన వాళ్లంతా ఏమయ్యారు? అని ప్రశ్నించారు. మా హయాంలో దాదాపు 550 ఆవులను దాతల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చాం అన్నారు. ఆ ఆవులు ఇచ్చే 15 వేల లీటర్ల పాలతో నిత్యం వేంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాదం కోసం వాడేమని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఇతర గోవుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.

Next Story