- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేపాల్‌లో చిక్కుకున్న కోట్ల సుజాత, కూతురు.. హోటల్‌లో లగేజీ, ఫోన్లు దగ్ధం
డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాత, కూతురు నివేదిత నేపాల్ లో చిక్కుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: నేపాల్(Nepal)లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాతున్నాయి. ప్రభుత్వ అవినీతిపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అల్లర్లు(Riots) చెలరేగాయి. యువతీ, యువకులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు. కానీ ఈ ఆందోళనలు, నిరసనలు హింసకు దారి తీశాయి. పలువురు పౌరులు మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో టూరిస్టులు బస చేసిన హోటళ్లకు సైతం నిప్పు పెట్టారు.
కానీ ఈ ఘటనలో భారతీయులు(Indians) సైతం చిక్కుకున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు సైతం ఉన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు చేపట్టారు. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయులు, తెలుగువాళ్లను స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వారి ఇళ్లకు చేరారు.
అయితే తాజాగా అందించిన సమాచారం మేరకు.. నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భార్య కోట్ల సుజాత(Kotla Sujatha, wife of MLA Kotla Surya Prakash Reddy), ఆయన కుమార్తె నివేదిత కూడా నేపాల్ చిక్కుకున్నట్లు తెలిసింది. అంతేకాదు వాళ్లు బస చేసిన హోటల్‌లో లగేజీ, ఫోన్లను నిరసనకారులు దగ్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కోట్ల సుజాత, ఆమె కుమార్తె నివేదిత సహాయం కోసం ఎదురు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం స్పందించి సురక్షితంగా తమను స్వస్థలానికి చేర్చాలని కోరినట్లు సమాచారం. మరి కోట్ల సుజాతమ్మ చిక్కుకున్న ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది






