బనకచర్లకు రూ.80 వేల కోట్లు అవసరమా.. మాజీ మంత్రి శైలజానాథ్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చును రాజేసిన విషయం తెలిసిందే.

బనకచర్లకు రూ.80 వేల కోట్లు అవసరమా.. మాజీ మంత్రి శైలజానాథ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చును రాజేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి (Raj Bhushan Chowdhury) రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ఇంకా ప్రాజక్ట్ పనులు ప్రారంభించలేదని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ సాంకేతిక, ఫైనాన్షికల్ ఎస్టిమేషన్ అంచనా కోసం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు మాత్రమే కేంద్ర జల సంఘానికి అందిందని కామెంట్ చేశారు. సదరు ప్రాజెక్ట్‌పై సంబంధిత అధికారులు, పరీవాహక ప్రాంత రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి శైలజానాథ్ (Shailajanath) కూటమి సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో అభివృద్ధిని గాలికి వదిలి సీఎం చంద్రబాబు బనకచర్ల అంటూ కొత్త రాగాలు పాడుతున్నారని సెటైర్లు వేశారు. అసలు ఎన్డీఏ సర్కార్ రాయలసీమకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. గోదావరి-బలకచర్ల లింక్ ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు అవసరమా అని ఆక్షేపించారు. కేవలం రూ.7 వేల కోట్లతోనే రాయలసీమ ప్రాజెక్ట్ (Rayalaseema Project) పూర్తి చేయవచ్చని అన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్త అయ్యేంత వరకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదని శైలజానాథ్ కామెంట్ చేశారు.

Next Story