ఎలాంటి ఆందోళన వద్దు.. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వివరణ

by Vemula.Srinu Prasad |

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు..

ఎలాంటి ఆందోళన వద్దు.. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన విజయవాడ జైలు(Vijayawada Jail)లో కాళ్లు, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. ఈ విషయాన్ని జైలు అధికారులకు చెప్పడంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. గుండె, శ్వాసకోశ, జనరల్ ఫిజీషియన్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. 2D Echo, చాతీ ఎక్స్ రే,ఈసీజీ సహా పలు పరీక్షలు చేశారు. బీపీలో హెచ్చుతగ్గులు, ఆస్థమా వల్ల వంశీ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

Next Story