- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anitha: ఆడవాళ్ల గురించి ఇంత నీచంగా మాట్లాడతారా?
‘అమ్మా భారతీ రెడ్డిగారూ.. మీ చానల్లో అమరావతి గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించడం లేదు..’ అని హోమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.

అన్నం తినే వాళ్లెవరైనా ఖండిస్తారు..
మంత్రి వంగలపూడి అనిత
దిశ, డైనమిక్ బ్యూరో : ‘అమ్మా భారతీ రెడ్డిగారూ.. మీ చానల్లో అమరావతి గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించడం లేదు..’ అని హోమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.విశాఖలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని తెలిపారు. దాదాపు రూ.77,200 కోట్లతో పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 49 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారని తెలిపారు. కృష్ణంరా జు తన కుటుంబాన్ని సోషల్ మీడియాలోకి ఎక్కించారని అన్నారు. భారతి రెడ్డి గురించి తప్పుగా మాట్లాడారని కిరణ్ అరెస్టు చేశామని గుర్తు చేశారు. పార్టీ సానుభూతిపరుడైనా కూడా అరెస్టు చేసి మహిళల పట్ల గౌరవం చాటు కున్నామని అని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్లడం చూసి అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. రాష్ట్ర గౌరవాన్ని భగ్నం చేసేలా సాక్షి ఛానల్ లో మాట్లాడారని, అమరావతి పై (Amaravathi) వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమ ర్థించకూడదన్నారు. అమరావతి అంటే జగన్కు మొదటి నుంచి అక్కసు ఉందన్నారు. రాజధాని (Rajadhani) అంటే వేల కోట్ల మంది రైతులకు త్యాగం అని.. అమరావతి రైతులు 1,630 రోజులు ఆందోళన చేశారని తెలిపారు. ఈ ఆందోళనల్లో 270 మంది చనిపోయారని తెలిపారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుపతికి పాదయాత్ర చేశారని, ఈ రైతుల పాదయాత్ర సమయంలో అడ్డంకులు సృష్టించారని తెలిపారు. అమరావతిపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికైనా అమరావతి ప్రజలకు జగన్, భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. దీని అసలు కుట్రదారులు ఎవరనేది కూడా త్వరలోనే తేలుస్తామన్నారు. సాక్షి చానల్‌పై కూడా చర్యలు చేపడతామని అన్నారు.






