- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఆదియోగి’ విగ్రహం.. ఎక్కడో తెలుసా!(ఫొటోలు వైరల్)
రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద ఆదియోగి విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద ఆదియోగి విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లో రాజమండ్రి(Rajamandri)కి అత్యంత సమీపంలో ఉన్న ద్వారపూడిలో నూతనంగా అతిపెద్ద ఆదియోగి విగ్రహం నిర్మించారు. అయితే ద్వారపూడిలో ఇప్పటికే అయ్యప్ప స్వామి టెంపుల్(Ayyappa Swamy Temple) చాలా ఫేమస్ అని అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవల నిర్మించిన ఆదియోగి విగ్రహం కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు లో నిర్మించిన ఈ "ఆదియోగి" విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ విగ్రహాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ తరుణంలో సెల్ఫీలు(Selfie), వీడియో(Videos)లతో సందర్శకులు సందడి చేస్తున్నారు. ఈనెల 26వ తేదీన మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ప్రజెంట్ ఈ విగ్రహం ఫొటోలు సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరల్ అవుతున్నాయి.






