- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంతి భద్రతల విషయంలో.. రాజీపడొద్దు! ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పు కనిపించాలని, అందుకు తగ్గ స్పష్టమైన మార్పును క్షేత్రస్థాయిలో తీసుకురావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పు కనిపించాలని, అందుకు తగ్గ స్పష్టమైన మార్పును క్షేత్రస్థాయిలో తీసుకురావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే.. నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం రావాలని, అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని పోలీస్ శాఖను ఉద్దేశించి సీఎం అన్నారు. ప్రజల భద్రతకు భరోసాను ఇవ్వాలని, ఆ విధంగానే పోలీస్ శాఖ పనిచేయాలని తెలిపారు. ఏపీలో పూర్తిస్థాయి శాంతి భద్రతలతో.. మళ్లీ ఇదివరకు లాగా రాష్ట్రం మొత్తం ప్రశాంతమైన వాతావరణం రావాలని వారికి సూచించారు. దీంతో పాటు ఎవరైనా రాజకీయ ముసుగులో ఉంటూ అరాచకాలకు పాల్పడితే మాత్రం, ఎట్టిపరిస్థితుల్లో వారిని ఉపేక్షించవద్దని, వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నేరాలను విచారించే విషయంలో కావచ్చు, నేరస్తులకు శిక్షల విషయంలో కావచ్చు, పోలీస్ అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర హోమ్ శాఖపై జరిపిన సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు పోలీసులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సమీక్షకు హోమ్ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావుతో పాటు పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






