ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి కానుక ప్రకటించిన CM

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-18 15:39:18  IST  )

ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన CM

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి కానుక ప్రకటించిన CM
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) పండుగ వేళ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శుభవార్త చెప్పారు. ఒక డీఏ ఇస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి డీఏ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. ఇందుకు రూ.160 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. పీఆర్సీపైనా త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ‘ఉద్యోగులకు మొత్తం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రూ.7వేల కోట్ల వరకు డీఏ పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఉద్యోగులకు తెలియాలి. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కీలక పాత్ర. రాష్ట్ర ఆదాయంలో 90 శాతం సంక్షేమ పథకాలు, మానవవనరులకే ఖర్చు చేస్తున్నాం. ఉద్యోగులకు పెండింగ్‌ బకాయిలు ఇవ్వడం మా బాధ్యత. ఉద్యోగులకు మంచి చేయాలని ఉంది కానీ మార్గం లేదు. దీపావళి వేళ ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. ఉద్యోగుల డీఏకి రూ.160 కోట్ల ఖర్చు. నవంబర్‌లో రూ.105 కోట్లు.. జనవరిలో రూ.105 కోట్లు ఇస్తాం. 180రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ ఎప్పుడైనా వాడుకోవచ్చు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story