అర్దరాత్రి హైవేపై దువ్వాడ హల్ చల్.. షాకింగ్ ఆడియో బయటపెట్టిన దివ్వెల మాధురి

by Ajay Maddhiboyina |

వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్ అర్ధ‌రాత్రి నిమ్మాడ హైవేపై హ‌ల్ చ‌ల్ చేశారు. త‌న‌పై ఎటాక్ చేసేందుకు ప్లాన్ చేశార‌ని అన్నారు.

అర్దరాత్రి హైవేపై దువ్వాడ హల్ చల్.. షాకింగ్ ఆడియో బయటపెట్టిన దివ్వెల మాధురి
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్ అర్ధ‌రాత్రి నిమ్మాడ హైవేపై హ‌ల్ చ‌ల్ చేశారు. త‌న‌పై ఎటాక్ చేసేందుకు ప్లాన్ చేశార‌ని అన్నారు. వైసీపీ నుండి త‌న‌ను బహిష్కించార‌ని కావాలంటే పూర్తిగా బ‌య‌ట‌కు పంప‌వ‌చ్చ‌ని అన్నారు. అలా చేస్తే స్వ‌తంతృడిగా శ్రీకాకుళం జిల్లాలో త‌న స‌త్తా ఏంటో చూపిస్తానని చెప్పారు. అవినీతిని ప్ర‌శ్నిస్తే చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దువ్వాడ వీడియో రిలీజ్ చేసిన అనంత‌రం ఆయ‌న రెండో భార్య దివ్వెల మాధురి ఓ ఆడియో రిలీజ్ చేశారు.

ఆడియోలో దువ్వాడ అనుచ‌రుడు కింజార‌పు అప్ప‌న్న దివ్వెల మాధురితో షాకింగ్ విష‌యాలు చెప్పారు. దువ్వాడ‌పై ఎటాక్ కు ప్లాన్ చేస్తున్నామని రామ‌స్వామి అనే వ్య‌క్తి హెచ్చ‌రించిన‌ట్టు చెప్పాడు. దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోతున్నాడ‌ని ఆయ‌న‌పై దాడి చేస్తామ‌న్నారని తెలిపాడు. నిమ్మాడ జంక్ష‌న్ లో దువ్వాడ శ్రీనివాస్ ను ఎలాగైనా కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం దివ్వెల మాధురి ఆడియో, దువ్వాడ శ్రీనివాస్ వీడియో వైర‌ల్ అవుతున్నాయి.

Next Story