- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్.. మాజీ మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో దర్యాప్తు చేపడున్న సిట్ అధికారులు ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడ జిల్లా జైలులో 9 మంది, గుంటూరు జిల్లా జైలులో ఇద్దరు, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే, రిమాండ్ గడువు ముగియడంతో వారిని విజయవాడ ACB కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం నిందితులకు మరో 13 రోజుల పాటు రిమాండ్ గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా లిక్కర్ స్కామ్‌పై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు స్పందించారు. ఇవాళ ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ ముఖ్య నేతలే టార్గెట్‌గా ఆధారాలే లేని ఆరోపణలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. రూ.3,600 కోట్ల లిక్కర్ స్కామ్ కేసు.. రూ.11 కోట్లకు వచ్చిందని ఎద్దేవా చేశారు. కూటమి సర్కార్ పాలనను గాలికొదిలి.. కక్ష్యా రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగడం లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఆరోపించారు.






