విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. నేడు ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

by velandi.Saikiran |

కోనసీమ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని

విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. నేడు ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థ‌లకు హాలిడే ఉండనుంది. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు జిల్లాల్లో కాలేజీలు, పాఠశాలలకు హాలిడే ప్రకటించారు. ఈ దిత్వా ఎఫెక్ట్ నెల్లూరు అలాగే తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఈ తుఫాన్‌ కారణంగా ఈ రెండు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు దారి చేసింది.

అలాగే క‌డ‌ప‌, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఇక ఈ భారీ వర్షాలు నేపథ్యంలో తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు నేడు హాలిడే ప్రకటించారు. కాగా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న జిల్లాల్లో మ‌రో 48 గంట‌ల పాటు అల‌ర్ట్ ఉండాల‌ని హోం శాఖ మంత్రి అనిత ఆదేశాలు ఇచ్చారు. అధికారుల‌కు సెల‌వులు కూడా ర‌ద్దు చేసారు.

Next Story