భారీ గుడ్‌న్యూస్: రేపటి నుంచి అక్కడ పెన్షన్ల పంపిణీ.. చివరి తేదీ ఇదే!

by Disha Web Desk 9 |
భారీ గుడ్‌న్యూస్: రేపటి నుంచి అక్కడ పెన్షన్ల పంపిణీ.. చివరి తేదీ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో ఏపీలో పెన్షన్ల పంపిణీ ఆలస్యం అయ్యింది. దీంతో గత వారం క్రితమే ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 3వ తారీకు నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా 3వ తేదీ నుంచి సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే, తాజాగా పెన్షన్ల పంపిణీ అంశంపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. వారం రోజుల్లో పంపిణీ మొత్తం పూర్తి చేయాలని తెలిపారు. రూరల్ ప్రాంతాల్లో అయితే ఇంటింటి పెన్షన్ పంపిణీ కుదుతుందని.. కానీ అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని పలువురు కలెక్టర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మరి కొంతమంది కలెక్టర్లు గ్రామ, సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని, పెన్షన్ దారులకు సచివాలయాల వద్ద టెంట్లు, తాగు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక రేపటి నుంచి అవ్వా, తాతలు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి, పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8వ తారీకు వరకు లబ్దిదారులకు పెన్షన్లు అందనున్నాయి.

Read More..

విశాఖపట్నంలో రూ.50 లక్షల నగదు స్వాధీనం

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

Next Story

Most Viewed