విశాఖపట్నంలో రూ.50 లక్షల నగదు స్వాధీనం

by Jakkula.Mamatha |

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.విశాఖ నగరంలో సుమారు 50 లక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

విశాఖపట్నంలో రూ.50 లక్షల నగదు స్వాధీనం
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.విశాఖ నగరంలో సుమారు 50 లక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే..నగరంలోని ద్వారకా నగర్ వద్ద ఈ నగదు పట్టుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న ద్వారకా నగర్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ద్వారక సీఐ రమేష్ వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story