అగ్ని ప్రమాద బాధితులకు చెక్కుల పంపిణీ.. హోంమంత్రి అనిత కీలక హామీ

by Ramesh Goud |
అగ్ని ప్రమాద బాధితులకు చెక్కుల పంపిణీ.. హోంమంత్రి అనిత కీలక హామీ
X

దిశ, వెబ్ డెస్క్: బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) పరిహారం అందజేశారు. అనకాపల్లి జిల్లా (Anakapally District) కోటఊరట్ల మండలం (Kotavuratla Mandal) కైలాసపట్నం (Kailasapatnam)లో బాణాసంచా తయారీ కేంద్రం (Fireworks manufacturing center)లో పేలుడు (Blast) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా.. మరికొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. బాదిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం (Coalition Government) రూ.15 లక్షలు పరిహారం (Compensation)గా ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా హోంమంత్రి అనిత బుధవారం కైలాసపట్నం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ప్రమాదంలో చనిపోయిన వారి చిత్రపటాలకు నివాళులు (Tributes) అర్పించారు. అంతేగాక వారి కుటుంబసభ్యులను ఓదార్చి, ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక అగ్ని ప్రమాదంలో చనిపోయిన కైలాసపట్నంకు చెందిన పురంపాప, గోవిందు, వేణుబాబు, చౌడివాడ గ్రామానికి చెందిన యస్.బాబురావు, రాజుపేట గ్రామానికి దాడి రామలక్ష్మి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందుతోందని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాల్లో ఉన్న చిన్నారులు మహేష్, బాలసాయిలను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అంతేగాక త్వరలోనే క్షతగాత్రులకు కూడా పరిహారం అందజేస్తామని అనిత హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed