Srisailam : శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి

by Y. Venkata Narasimha Reddy |

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం(Srisailam) మహాశివరాత్రి (Maha Shivaratri 2025) బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల ఏర్పాట్ల(Arrangements)లో అపశృతి(Disruption) చోటుచేసుకుంది.

Srisailam : శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం(Srisailam) మహాశివరాత్రి (Maha Shivaratri 2025) బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల ఏర్పాట్ల(Arrangements)లో అపశృతి(Disruption) చోటుచేసుకుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో భాగంగా విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరు ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ కు గురయ్యాడు. గద్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ (26) విద్యుత్తు తీగలు మార్చే క్రమంలో షాక్‌కు గురయ్యాడు. సహచర సిబ్బంది వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేయించి తీగల మధ్య చిక్కుకుని కొన ఊపిరితో ఉన్న కృష్ణను వెంటనే కిందకు దించి శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో అత్యవసర చికిత్స కోసం తరలించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కృష్ణను కాపాడేందుకుగా వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Maha Shivaratri 2025) ఈసారి శ్రీశైలం(Srisailam)లో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి సందర్భంగా మాఘమాసంలో శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు వసతులు, శివరాత్రి పూజల సంస్కృతులు, భక్తుల అవధి, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ఏర్పాట్లు సాగుతున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలు 19న ప్రారంభమయ్యే ముందు నుండే భక్తుల రాక మొదలవుతుంది. దీంతో ఏర్పాట్లన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థానం యంత్రాంగం కృషి చేస్తోంది.

పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదుల మరమ్మతులు చేపట్టారు. ధ్వజారోహణంత మొదలయ్యే బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలైన భృంగి వాహనసేవ, హంస వాహనసేవ, మయూర వాహనసేవ, రావణ వాహనసేవ, పుష్పపల్లకీ సేవ, గజ వాహనసేవ, మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వాహణకు ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రథోత్సవం, తెప్పోత్సవం, యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కూడా నిర్వహిస్తారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో ఆలయ దర్శన విధానాల్లో మార్పులుంటాయి. శివదీక్ష భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, జ్యోతిర్ముడి సమర్పణకు ప్రత్యేక ప్రణాళికలు, భక్తుల సౌకర్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story