- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్‌ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు. రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ.. తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాలుపంచుకున్నాయి.
Next Story






