చర్చనీయాంశంగా ‘దిశ’ కథనం.. జనసేనలో చేరికలకు బ్రేక్!

by Sathputhe Rajesh |

విశాఖకు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, వివాదాస్పద నేతలు జనసేనలో చేరేందుకు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

చర్చనీయాంశంగా ‘దిశ’ కథనం.. జనసేనలో చేరికలకు బ్రేక్!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖకు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, వివాదాస్పద నేతలు జనసేనలో చేరేందుకు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ‘జనసేనలో చేరికల చిచ్చు’ శీర్షికన బుధవారం ‘దిశ’లో ప్రచురించిన కథనం చర్చనీయాంశమైంది. వైసీపీ పాలనలో ఒక రేంజ్‌లో రెచ్చిపోయిన ఆ పార్టీ నేతలు బెహరా భాస్కరరావు ,ఆళ్ళ శివ గణేష్, జనసేన నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్ ఉషశ్రీలను చేర్చుకోవటంపై పార్టీ నాయకులు కేడర్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు పలువురు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.

తరువాత చూద్దాం..

అసెంబ్లీ ఎన్నికలు అయ్యేవరకు చేరికలను పక్కన పెట్టాలని జనసేన అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. కూటమి నేతలనుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతుందడడంతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖ తెలుగుదేశంలో కొందరు వైసీపీ కార్పొరేటర్ల చేరిక విభేదాలకు దారితీసింది. దీంతో అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం జాయినింగులపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

Next Story