- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకేం గుర్తు లేదు.. ఒంగోలు రూరల్ పోలీసులకు చెప్పిన రామ్ గోపాల్ వర్మ
చంద్రబాబు, పవన్ కల్యాణ్ మార్ఫింగ్ ఫొటోల వ్యవహారంలో తనకేం గుర్తు లేదని ఒంగోలు రూరల్ పోలీసులకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు..

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) మార్ఫింగ్ ఫొటోలకు సంబంధించిన కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్(Ongole Rural Police Station)లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే దాదాపు ఆరు గంటలపాటు ఆర్జీవీని విచారించారు. చంద్రబాబు, పవన్ మార్ఫింగ్ ఫొటోలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. అయితే రామ్ గోపాల్ వర్మ తనకేం తెలియదని సమాధానం చెప్పారు.
కాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెట్టారని ఒంగోల్ రూరల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ(Tdp) కార్యకర్త రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. కానీ కొంత సమయం కావాలని పలుమార్లు కోరారు. ఈ మేరకు పోలీసులు సైతం సమయం ఇచ్చారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆర్జీవీ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోల్ రూరల్ పోలీసులు ఎదుట హాజరుకావడంతో విచారణ చేపట్టారు.






