- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Gopal Varma: సీఐడీకి షాక్.. స్టే ఇవ్వాలంటూ హైకోర్టుకు ఆర్జీవీ
అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సంబంధించిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు..

దిశ, వెబ్ డెస్క్: ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’(Amma Rajyamlo Kadapa Redlu) సినిమాకు సంబంధించిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Directe Ram Gopal Varma)కు ఒంగోలు(Ongole), మంగళగిరి(Mangalagiri), అనకాపల్లి(Anakapalli)లో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సీఐడీ పోలీసులు(CID Police) నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు.
కాగా ‘అమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను 2019లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలో అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వివాదస్పద సీన్లు చిత్రీకరించారంటూ అప్పట్లోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాదు కులాలను రెచ్చగొట్టే విధంగా సినిమాలో చూపించారని పలు చోట్ల కేసులు కూడా నమోదు చేశారు. అయితే అప్పుడు ఈ ఫిర్యాదులపై ఎలాంటి అడుగులు ముందుకుపడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒంగోలు, మంగళగిరి, అనకాపల్లిలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సీఐడీ రంగంలోకి దిగింది. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ విచారణకు హాజరుకావాలని సూచించింది. అయితే పలు కారణాలు చెబుతూ ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో రామ్ గోపాల్ వర్మకు బుధవారం మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హారుకావాల్సిందేనని పేర్కొంది. దీంతో రామ్ గోపాల్ వర్మ తాజాగా ఏపీ హైకోర్టు(Ap High Court)ను ఆశ్రయించారు. మరి రామ్ గోపాల్ వర్మ పిటిషన్‌ను ధర్మాసనం స్వీకరిస్తే.. ఎలాంటి తీర్పు వస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆర్జీవీ కోరినట్లు స్టే వస్తుందా అనేది చూడాల్సి ఉంది.






