- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home Minister Anitha:‘అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’.. అధికారులకు దిశానిర్దేశం
గత ప్రభుత్వం పై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: గత ప్రభుత్వం పై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. గత వైసీపీ(YSRCP) హయాంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) హోం మంత్రి అనిత అగ్నిమాపక శాఖ(Fire Department) పై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనిత(Home Minister Anitha) మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం అగ్నిమాపక శాఖను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అగ్నిమాపకశాఖ తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తి చేశారు. కొందరు ఉన్నతాధికారుల తీరుపై విమర్శలున్నాయని ఆమె ఆరోపించారు. పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అగ్నిమాపకశాఖ పై గత కొంతకాలంగా వరుస ఫిర్యాదులు రావడంతో ఆమె సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రం(Andhra Pradesh)లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. వేసవి కాలం నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ క్రమంలో వేసవికాలంలో(Summer) అగ్ని ప్రమాదాలు(Fire hazards) జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు హోం మంత్రి అనిత దిశానిర్దేశం చేశారు.






