తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామివారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామివారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కన్నడ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన తనయుడు కిరీటి కూడా స్వామివారిని దర్శించుకుని.. సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. తీర్థప్రసాదాలు అందజేశారు.

కాగా.. ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు జరపనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి, 4న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 5న పవిత్రోత్సవాలు ప్రారంభమై 7న ముగియనున్నాయి. అలాగే 8న తిరునక్షత్రం, 9న శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడసేవ, 10న శ్రీ మలయప్పస్వామివారు విఖనసాచార్యుల సన్నిథికి రావడం, 16న గోకులాష్టమి ఆస్థానం, 17న తిరుమల శ్రీవారి సన్నిధి నశిక్యోత్సవం, 25న బలరామ జయంతి, వరాహ జయంతి నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Next Story