- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళితులపై దాడులు చేసేందుకా అధికారం ఇచ్చింది? : మల్లాది విష్ణు
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రజలు కూటమి పార్టీలకు అధికారం ఇచ్చింది దళితులపై దాడి చేసేందుకా అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు (Malladi Vishnu) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పిన్నెల్లి గ్రామానికి చెందిన మంద సాల్మన్ ను (Manda Salmon) హత్య చేయడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైయస్ జగన్ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఎస్సీ సెల్ (YCP) ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రెడ్ బుక్ ను ఇప్పటికైనా పక్కన పెట్టాలన్నారు. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న కొందరు సాల్మన్ ను దారుణంగా హతమార్చారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పోలీసులు కూడా బాధితుల పక్షాన నిలవకుండా బాధ్యుల పక్షాన నిలుస్తున్నారని విమర్శించారు. సాల్మన్ హత్యకు గురికాకుండా నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. హత్యనంతరం సాల్మన్ దహన సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. స్థానిక సీఐను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. హత్యా రాజకీయాలకు తెర లేపకుండా ప్రజా సంక్షేమంపై ఫోకస్ చేయాలని కోరారు.






