AP: ఆ పాపను తండ్రే అమ్మేశాడా..? చిన్నారి మిస్సింగ్​కేసులో ట్విస్ట్​

by Thanuru Gopichand |

AP: ఆ పాపను తండ్రే అమ్మేశాడా..? చిన్నారి మిస్సింగ్​కేసులో ట్విస్ట్​
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్ వద్ద అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి శ్రావణి ఆచూకీ లభించింది. గుర్తుతెలియని వ్యక్తులు తమ కుమార్తె మూడేళ్ల శ్రావణిని కిడ్నాప్‌ చేశారని తల్లిదండ్రులు జి ఆర్ పి పోలీసులను నిన్న ఆశ్రయించారు. రైల్వే సీఐ నేతృత్వంలో రంగంలో దిగిన రెండు ప్రత్యేక బృందాలు చిన్నారి కోసం గాలించాయి. సీసీ కెమెరా దృశ్యాలు కూడా పరిశీలించాయి. ఈ క్రమంలో విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి. రైల్వే స్టేష న్ లో మిస్సైన చిన్నారి శ్రావణి ఆచూకీ లభించింది. శ్రావణిని బొల్లా శ్రీనివాస్, చిన్నారి అనే మహిళ తీసుకెళ్లినట్లు గుర్తించారు. శ్రావణి తండ్రి మస్తాన్ కు రూ.5 వేలు ఇవ్వగా .. అతను స్టేషన్ నుంచి బయటకు వెళ్ళటంతో శ్రావణి తో సహా శ్రీనివా స్, చిన్నారి ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. శ్రావణిని చిన్నారి అనే మహిళ స్వస్థలం రాజమండ్రిలో ఉన్న సీతంపేటకు తీసువెళ్తుడగా l పోలీసులు పట్టుకున్నారు. పాపతో సహా ఇద్దరు నిందితులను పోలీసులు విజయవాడ తీసుకు వస్తున్నారు. తండ్రి మస్తాన్ పై కేసు నమోదు చేస్తున్నారు. శ్రావణి నీ అమ్మేందుకు తీసుకు వెళ్తున్నారా లేక బెగ్గింగ్ చేయించడానికి తీసుకు వెళ్తున్నారా అనే అంశాలను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మస్తాన్ దంపతులు విడివిడిగా ఉంటున్నట్టు గుర్తించారు. శ్రావణి తల్లిని వేటపాలెం నుంచి పిలిపిస్తున్నారు.

Next Story