- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత!
మంగళగిరి ఎయిమ్స్ హాస్టల్‌లో డయేరియా కలకలం రేపుతోంది. 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ (Mangalagiri AIIMS) హస్టల్‍లో డయేరియా (Diarrhea) కలకలం రేపుతోంది. వసతి గృహంలోని 25 మంది విద్యార్థులు, సిబ్బందికి అస్వస్థతకు గురయ్యారు. మూడురోజులుగా డయేరియా సోకి ఇబ్బందులకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితులకు ఎయిమ్స్ లోనే ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ లోని వసతి గృహాల్లో బాధితులు వాంతులు, విరేచనాలతో డయేరియా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో నీటి కాలుష్యం కారణం కావచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీంతో నీటి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది ఏ ప్రాంతంలో కలుషితం కావడానికి అవకాశం ఉంది అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు హాస్టల్ లోని కుళాయిల నుంచి సుమారు 40 నీటి నమూనాలను సేకరించి టెస్టుల కోసం ల్యాబ్‍కు పంపించారు.






