విజృంభించిన డయేరియా.. మహిళ మృతి.. 22 మందికి అస్వస్థత

by Vemula.Srinu Prasad |

విజయవాడలో డయేరియా విజృంభించింది..

విజృంభించిన డయేరియా.. మహిళ మృతి.. 22 మందికి అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో డయేరియా(Diarrhea) విజృంభించింది. న్యూ రాజరాజేశ్వరి పేటలో బుధవారం వాంతులు, విరేచనాలతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే వీరిలో నాగమణి అనే మహిళ మృతి చెందారు. మరో 22 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంచినీటి కాలుష్యమే స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రాజరాజేశ్వరి పేటలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Next Story