- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనకాపల్లిలో ప్రబలిన డయేరియా.. 25 మందికి పైగా అస్వస్థత
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గుడిచర్ల, కొత్తూరు గ్రామాల్లో డయేరియా విజృంభించింది. 25 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) నక్కపల్లి మండలం గుడిచర్ల(Gudicharla), కొత్తూరు(Kotturu) గ్రామాల్లో డయేరియా(Diarrhea) విజృంభించింది. 25 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరికీ స్థానిక పీహెచ్‌సీలో వైద్యం అందిస్తున్నారు. తాగు నీరు కలుషితం కావడంతోనే డయేరియా ప్రబలిందని పలువురు స్థానికులు ఆరోపించారు.
అయితే విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు. వ్యాధి ప్రబలకుండా రెండు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. అటు హోంమంత్రి అనిత సైతం స్పందించారు. పరిస్థితిని సమీక్షించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. మరోవైపు రోగుల సంఖ్య పెరుగుతోందని పీహెచ్‌సీ సిబ్బంది తెలిపారు. వాంతులతో రోగులు బాధపడుతున్నారని చెప్పారు. మూడు రోజులుగా రోగులు తమ పీహెచ్‌సీకి వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం నల్లాల్లో వచ్చిన నీటిని తాగడం వల్లే గుడిచర్ల, కొత్తూరు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారని స్థానిక నాయకులు తెలిపారు.






