- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటివరకు 130 డయేరియా కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి 70 మందికి పైగా డిశ్చార్జ్ చేశారు. స్థానికంగా హైస్కూల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బాధితులకు శిబిరంలోనే వైద్య సాయం చేసేందుకు ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. న్యూ రాజ రాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాల్వల్లో బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలు అధికారులు నిర్వహిస్తున్నారు. హై స్కూల్ లోని వైద్య శిబిరంలో అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచారు. ఈరో జు ఉదయం న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, పొంగూరినారాయణ, ఎంపీ కేశినేని చిన్ని పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.. అధికారులను అప్రమత్తం చేశాం అని తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నాం.. నీటి శాంపిల్స్ సేకరిస్తున్నాం అని పేర్కొన్నారు. నీరు, పానిపూరి, వంకాయెండి చేపలు తినడం వలన డయేరియా ప్రబలిందని స్థానికులు చెబుతున్నారు అని అన్నారు. మంచినీటి సరఫరా లో తేడా చర్యలు తీసుకుంటున్నాం అని ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు






